గుంతకల్లు శాసనసభ్యులు వెంకట్రాంరెడ్డిపై మండిపడ్డ బండి శేఖర్

గుంతకల్లు, అదే సినిమా గ్లామర్ తో ఆయన కష్టపడి సినిమా తీసిన డబ్బులుతో వేసిన పంటకు గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 3000 మంది కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన వారు ముఖ్యమంత్రి కావచ్చు. సినిమా పరిశ్రమలో మేకప్ వేసుకొని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మా జనసేన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కాకూడదా..? మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గుంతకల్ నియోజకవర్గం నుండి పోటీ చేయమన్నారు. మీరు విసిరిన సవాల్ ని మేము స్వీకరిస్తూ మా జనసేన పార్టీ అధ్యక్షులు దగ్గరకి వెళ్లి వివరిస్తాం. ఒకవేళ మా జనసేన పార్టీ అధ్యక్షులు గుంతకల్ నియోజకవర్గం నుండి పోటీ చేయలేని పరిస్థితుల్లో మీరు మాట్లాడిన మాటలు మేము స్వీకరిస్తూ గుంతకల్ నియోజకవర్గంలో అంతఃకరణ శుద్ధితో జీరో పాయింట్ రాజకీయం చేస్తాను ఒక సామాన్యుడు గెలుపు ఎలా ఉంటుందో చూపిస్తామని జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్ ధ్వజమెత్తారు.