ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు: తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

  • జనసేన పార్టీ పోరాటాలకు, సేవా కార్యక్రమలకు ఎల్లప్పుడు ముందు ఉంటుంది
  • ఉప్పాడ కొత్తపల్లి ప్రజలు ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడాలి?
  • మండిపడ్డ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, బుధవారం పిఠాపురం పట్టణంలో ఉప్పాడ రైల్వే గేట్ వద్ద ఏలేరు కాలువ పై ఉన్న 70 సంవత్సరాల క్రితం నాటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది అని, ప్రమాదాలకు కేంద్రంగా మారింది అని, మరమ్మతులు చేసి భద్రత ప్రమాణాలు పాటించాలి అని జనసేన నాయకులు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిడ్జ్ కూలిపోయే దశలో ఉన్నా పట్టించుకోలేని పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్ధమవుతుంది అని ఉప్పాడ-పిఠాపురం మార్గంలోనే అనేకమంది విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లి వచ్చే రోగులు సుమారు 30 గ్రామాల ప్రజలు అనేక రకాల ప్రయాణికులు వెళ్తూ వస్తూ ఉంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కనీసం పక్కనే గతంలో మా నాయకులు
చేసిన పోరాటల దృష్ట్యా ప్రక్కనే నామ మాత్రంగా వేసిన రోడ్డుని కూడా సరిగా వేయలేకపోతున్న ఈ ప్రభుత్వం గత ఏడాది జులై నాటికే అద్దంలా మెరిసేలా రోడ్లు వేస్తాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని, ఉప్పాడ కొత్తపల్లికి చెందిన 30 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతూంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణం అని వైసీపీకి ఈ ప్రజల సమస్యలు పట్టవా? వీళ్ళు ఓట్లు అయినా మీకు అవసరం లేదా అని ప్రశ్నిస్తూ తక్షణమే రోడ్లు మరమ్మతులు చేసి స్థానికంగా ఉన్న సమస్యకు రానున్న రోజుల్లో పరిష్కారమార్గం చూపనిపక్షంలో తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని
హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, వీర మహిళలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • దివ్యంగులకు అండగా జనసేన

ఎఫ్.కె పాలెంలో స్థానికంగా సచివాలయంలో పనిచేస్తున్న మంగమ్మ అనే మహిళ ప్రమాదవశాత్తూ తన కాలు కోల్పోయిన పరిస్థితిని చూసి జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి చల్లా లక్ష్మి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వీల్ చైర్ ను పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆభాగ్యులకు అండగా జనసేన ఎప్పుడు తోడుగా ఉంటుంది అని స్థానికంగా ఉన్న మహిళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ సేవా కార్యక్రమలలో ఎల్లప్పుడు ముందుగా ఉండే జనసేన నాయకురాలు చల్లా లక్ష్మికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.