ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 6వ రోజు

  • జగన్ రెడ్డి మాటలు వినీ వినీ ప్రజలు విసుగెత్తిపోయారు
  • పవనన్న ప్రజాబాటలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు, జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలో 6 వ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డు వెంకట్రావుపల్లిలో శుక్రవారం పర్యటించడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ మరియు మంచి నీళ్ళు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజల సమస్యలన్నీ తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నదని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దాడి భాను కిరణ్, రాకేష్, వంశీ, చంద్ర, అనిల్, సురేష్, వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.