రాజకీయాల్లో జగన్ రెడ్డి లాంటి వ్యక్తులు ప్రమాదకరం..!

గుంటూరు, ప్రజల జీవితాలను, సమాజ అభివృద్ధిని ప్రభావితం చేసే రాజకీయాల్లో వికృతాలోచలను నిలువెల్లా నింపుకున్న జగన్ రెడ్డిలాంటి వ్యక్తులు అత్యంత ప్రమాదకరమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం శ్రీనివాసరావుతోటలోని అచ్చయ్య డాబా సెంటర్లో వైసీపీ అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇక లాంఛనమే పోస్టర్లను టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు సంయుక్తంగా ఆవిష్కరించారు. సైకో పోవాలి – సంకీర్ణం రావాలి ఉమ్మడి పొత్తు గెలవాలి – వైసీపీ ఊసే లేని రాష్ట్రం కావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందని విమర్శించారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగులు ఎవరూ కూడా ఈ నిరంకుశ పాలనలో స్వతంత్రంగా బ్రతికే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దుర్మార్గాలను ఎవరూ ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపడం ఆనవాయితీగా మారిందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుష్పరిపాలన సాగిస్తున్న వైసీపీ అరాచకశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీలు ఉమ్మడి పొత్తుకుదుర్చుకున్నాయన్నారు. పది తలల రావణాసురుడిని వధించటానికి శ్రీరాముడు అంతటివాడు ఆంజనేయస్వామి, సుగ్రీవుడు అంగదుడు లాంటి ఎంతోమంది వీరుల సహాయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 151 తలల విషసర్పాలతో అరాచకాలు, దౌర్జన్యాలు, దాష్టీకాలతో ప్రజల జీవితాలను కాల్చుకుతింటున్న జగణాసురుడిని రాజకీయ సంహారం చేయటానికి మూడు ప్రధాన పార్టీలు ఒక్కటిగా జట్టుకట్టాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన అధికారం నిలబెట్టుకోవటానికి ఎంతటి అరాచకాలకైనా, విధ్వంసాలకైనా పాల్పడే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు.పోలీసు వ్యవస్థతో పాటూ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని వాటిని రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించే ప్రమాదమూ లేకపోలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి త్రిమూర్తుల కలయిక మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ను అందిస్తుందని ఆళ్ళ హరి అన్నారు. తమ నాయకులు తీసుకున్న నిర్ణయాల ప్రకారం క్షేత్రస్థాయిలో తాము కలిసి మెలిసి ముందుకు సాగుతామని బీజేపీ నాయకులు రంగా, జనసేన నేత షర్ఫుద్దీన్, టీడీపీ నాయకులు షేక్ నాగూర్ లు ప్రకటించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, ఉమ్మడి పార్టీల నేతలు గడ్డం రోశయ్య, శ్రావణ కుమారి, జూపూడి దుర్గా భవాని, ఉప్పుతల సాంబయ్య, దూలిపూడి రాంబాబు, ఆదాం, చింతకాయల సాయి, నండూరి స్వామి, గంధం బాబ్జి, పగిడిపోగు రమేష్, కొలసాని బాలకృష్ణ, బీజేపీ రామకృష్ణ, బాలాజీ, కోలా మల్లి, తిరుమలరావు చౌదరి, బియ్యం శ్రీను, అలా కాసులు, చంద్రబాబు, పోతురాజు, తదితరులు పాల్గొన్నారు.