నెల్లూరు ప్రజలు నారాయణని నమ్ముతున్నారు

నెల్లూరు, జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజినల్ కో-ఆర్డినేటర్ గా ఎన్నికైన గుడ్లూరు నాగరత్నం యాదవ్ ని అభినందిస్తూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆపిన 30 శాతం పూర్తి చేసిన పనులు పూర్తి చేయలేకపోయారని నారాయణ గారిని విమర్శించడం సరే కానీ ఆ 30% పనులు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారో వివరించగలరు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పుకునే మీరు గడిచిన ఐదు సంవత్సరాలలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో తెలుపగలరు. ఇకపోతే అప్పు గురించి వైఎస్ఆర్సిపి పార్టీయే చెప్పాలి.వైసీపీ నాయకులు తమ జేబులో నుంచి అభివృద్ధి చేసినట్లు రికార్డులు ఏమీ లేవు. పథకాల అమలు పేరుతో మీరు చేసిన అప్పుల గురించి అందరికీ తెలిసిందే. అభివృద్ధి సాధించి దానిమీద రెవిన్యూ జనరేట్ చేసి దాన్ని ఏ విధంగా తీర్చాలో లెక్క చూపించి నారాయణ గారు అప్పు తెచ్చారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి బటన్ నొక్కేందుకు ఉపయోగిస్తున్న నిధుల సమాచారం తెలిసిందే. మీరు ఎక్కడ ఎండ్ టూ ఎండ్ రోడ్ల వల్ల ప్రజలు ఎంత లబ్ధి పొందారో వారిని అడిగితే చెప్తారు. ఈ మధ్యకాలంలో హడావిడి చేస్తూ మీరు వేసిన రోడ్లు కనీసం డ్రైనేజీ ఆప్షన్లు గానీ కాలువలకు స్థలం గాని వదల్లేదు వాటితో పోల్చుకొని చూస్తే ఎంత మెరుగ్గా వారి రోడ్లు ఉన్నాయనేది తెలియజేయగలరు. అవగాహన లేని మీ కామెంట్లకు అర్థం లేదు చెట్లు చేమా అని సహజ సంపద గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సిపి నాయకులకు లేదు. సహజ వనరులను దోచుకు తింటున్న వారికి మాట్లాడే హక్కు లేదు. ఉపాధ్యాయునిగా మీరు చేసిన సేవలను గుర్తెరిగి ఉపాధ్యాయులు మిమ్మల్ని గెలిపించారు ఏమో కానీ అభివృద్ధి సాధించకుండా నాశనం చేస్తున్న వైసిపి నాయకులకు ఎమ్మెల్యేగా గెలిపించే పరిస్థితి నెల్లూరులో లేదు. ఈ నాలుగు సంవత్సరాలలో మీరు చేయని అభివృద్ధి వచ్చే ఐదు సంవత్సరాలలో చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనుభవం గల నాయకులు లేరు, రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి విచిత్ర ప్రవర్తనకు అందరూ పారిపోయి ఉన్నారు. నిజంగా మీరు అభివృద్ధి సాధించి ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పారిపోయే పరిస్థితి ఉండదు. నారాయణ గారు ఎంతో విజన్ ఉన్న నాయకుడు రాజధాని నిర్మాణ విషయంలో ఆయన చూపిన చొరవ మరువలేనిది. రాజధాని పనులు ఆపి అభివృద్ధిని ఆపేసిన వైసిపి నాయకులు నారాయణ గారిని ఎంత దూషిస్తే అంత మెజారిటీతో గెలవడం తథ్యం. నగరంలో ఎమ్మెల్యే కానీ ,ఎంపీ కానీ కాన్వాసింగ్ తిరుగుతుంటే ఎన్నడూ చూడని వైఎస్ఆర్సిపి నాయకులను రోడ్డును చూడాల్సి వస్తుందని ప్రజలు మొత్తుకుంటున్నారు. నెల్లూరు నగరానికి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధికి పదంలో ముందుకు దూసుకు వెళ్లేటట్లు చేసిన నారాయణ గురించి ఎవరు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న వైసిపి అరాచక పాలనను అంతమొందించడానికి, వైసీపీ ప్రభుత్వ రౌడీ రాజకీయ రూపుమాపేందుకు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని పొత్తుకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ నిర్ణయానుసారం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించేందుకు జనసేన నాయకులు జనసేన శ్రేణులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుదిర్చిన పొత్తుకి వైసిపి నాయకులు కుదేలు అవుతున్నారు. ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వారి వింత ప్రవర్తనను వ్యక్త పరుస్తున్నారు. అభివృద్ధి అనేది మరిచిపోయి రెవిన్యూ జనరేట్ చేయడం గాలికి వదిలేసి, కేవలం బటన్ నొక్కడానికి పరిమితమైన వైసీపీ నాయకులని వైసిపి ప్రభుత్వాన్ని తరిమికొట్టవలసిందిగా పిలుపునిస్తున్నాము. గత పది సంవత్సరాలుగా అంటే పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీని వెన్నంటి ఉండి పార్టీకి సేవ చేసిన గుడ్లూరు నాగరత్నం గారు ఈరోజు కృష్ణ పెన్నా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియామకం కావడం అభినందనీయం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు చెప్పే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అందరినీ కలుపుకుని, కలిసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలిపారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బలపరిచిన అభ్యర్థులను సమిష్టి కృషితో గెలిపిస్తాం. జిల్లాలో జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలోని వీర మహిళా విభాగాన్ని బలోపేతం చేస్తాం. బాధ్యత ఉన్న నాలుగు జిల్లాల్లో జనసేన పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని. పొరపొచ్చాలు ఉంటే సర్దుకొని పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేసి ప్రజా ప్రభుత్వం నిర్మాణానికి అందరూ కలిసి నడుస్తామని తెలిపారు.చ్జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గత సంవత్సరం రోజులుగా కృష్ణ పెన్నా జిల్లాల కో-ఆర్డినేటర్ గా కొనసాగుతున్న కోలా విజయలక్ష్మితో పాటు గుడ్లూరి నాగరత్నం యాదవ్ ని కూడా కృష్ణా పెన్నా జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ గా ఎంపిక చేసిన సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కృష్ణ పెన్నా జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ నాగరత్నం యాదవ్, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జనసేన సీనియర్ నాయకులు ఏటూరు రవి, వీర మహిళలు నిర్మల, రేణుక, కృష్ణవేణి, నందిని, ప్రసన్న, హసీనా, హేమచంద్ర యాదవ్, మౌనిష్, షాజహాన్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు.