మంచినీటి సమస్యను పరిష్కరించాలి – జనసేన ఆధ్వర్యంలో నిరసన

విజయనగరం: జిల్లాలో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మహిళా రిజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపారు. జిల్లాల విభజన వలన విజయనగరం ఆదివాసీలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, పోడు పట్టాలు. సర్వేలు అయ్యి స్కెచ్ లు వచ్చి ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న గిరిజనులకు ఒక్క గ్రామంలో కూడా కనీసం ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. అలాగే జిల్లాలో నేటికీ రోడ్లు కరెంట్. మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు దర్శనమిస్తున్నాయని, జిల్లాలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ అలాగే బోయ వాల్మీకులను మరియు ఇతర ఏ కులాలను గిరిజన జాబితాలో చేర్చకూడదని కొన్ని ప్రధాన డిమాండ్లు జిల్లా కలెక్టర్ కు తెలియజేయడం జరిగిందని తుమ్మి అప్పలరాజు దొర తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.