ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి పదంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు జనసేన, టిడిపికి ఓటు వేయాలి

విజయవాడ: జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మరియు 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. అప్పుల ఆంధ్ర ప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే ప్రజలు తప్పకుండా జనసేన, టిడిపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అత్యుత్సాహంతో ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ శ్రీకృష్ణ మీద దాడి చేయడం వ్యక్తిగత దాడి కాదు మీడియా అనే వ్యవస్థ పైన దాడి అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే మీడియా పై దాడులు చేయరని అన్నారు. తిరుపతి అనూష మాట్లాడుతూ.. స్థానిక కార్పొరేటర్ సమస్య అని ప్రజలు వెళ్తే ఉచిత సలహాలు ఇస్తునరంట, కార్పొరేటర్ తెలివితేటలన్నీ దోచుకోవడం, దాచుకోవడం మీదే ఉన్నాయి. ప్రజలకు సహాయం చేయడంపై ఏమాత్రం శ్రద్ధ లేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారిని జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆయాజ్, తులసి మురళి, ఆదిత్య రెడ్డి, రెడ్డిపల్లి శ్యామ్, మహేశ్వరి, అల్లా బక్షు, వెంకట్రావు, కానాల వినోద్ కుమార్, మరియు జనసేన నాయకులు వెన్న శివశంకర్, కొరగంజి రమణ, బొమ్మ రాంబాబు, శనివారపు శివ, పైలా పవన్, బొట్టా సాయి, సుఖాసి భాను ప్రకాష్, బందిచోడే శ్రీనివాస్, మంతా రాజేష్, పులి చెరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.