ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా, దందాలపై కలెక్టర్ కి వినతిపత్రం

తిరుపతి, రుయా హాస్పిటల్ లో జరిగిన సంఘటనపై జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, బాబ్జి, మునుస్వామి లు అఖిలపక్ష నేతలతో కలిసి ప్రైవేట్ అంబులెన్స్ ల మాఫియా, దందాలపై కలెక్టర్ కి వినతిపత్రం అందజేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరగా.. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.