జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత గౌరవనియులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లము అని చెప్పుకునే కొంత మంది వైసీపీ గుండాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ వాలంటీర్ల వ్యవస్థని తప్పుగా మాట్లాడాడని కొంతమంది వాలంటీర్లమని చెప్పుకుంటున్న వైసీపీ గుండాలు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం ప్రశ్నించే గొంతుకను ప్రజా స్వామ్యాన్ని దహనం చేయడమేనని జనసేన పార్టీ అన్నమయ్య జిల్లాలో ఉద్ఘాటించారన్నారు. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను కొంత మంది వైసీపీ గుండాలు దహనం చేసిన కార్యక్రమానికి నిరసనగా అన్నమయ్య జిల్లాలో రాయచోటి అసంబ్లీ ఇంచార్జ్ హసన్ భాష, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హసన్ భాష, రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థ అనేది పదవతరగతి చదువుకున్న నిరుద్యోగికి ఉద్యోగమే కానీ పెద్దచదువులు చదువుకున్న వారికి కూడా ఉద్యగమనే గొప్ప ఆశ చూపి నిరుద్యోగంలో ముంచుతూ ఒక పార్టీ కి భవిష్యత్తులో మీరే నాయకులు అంటూ నిరుద్యోగతను పెంచుతూ సామాన్యులను తమ కోసం వాడుకుంటూ ప్రభుత్వ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. అదేవిధంగా డా:బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యగంలో కల్పించిన ప్రాథమిక హక్కులు గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీలను కాదని వాలంటీర్లను నియమించి రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడుస్తూ 50 ఇండ్లకు ఒక గుండాను నియమించి ప్రజలని ముప్పు తిప్పలు పెట్టి ప్రతి చిన్న అవసరానికి ఎడిపిస్తున్నారని అంటూ ఈ వ్యవస్థని జనసేన పార్టీ అధికారంలోకి రాగానే రూపుమారుస్తామని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ తరపున తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడపజిల్లా కార్యక్రమాల సభ్యుడు రియాజ్, రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షుడు చిన్నారి జయరామ్, యువనాయకుడు చింతల దినేష్, జనసైనికులు శివ, నవీన్, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.