ఫైజర్‌ మూడోదశ ట్రయల్స్‌.. 95 శాతం ఫలితాలు

కరోనాని అంతం చేసే వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలకు అమెరికా ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్‌ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాధి సోకకుండా నిరోధించడంలో తమ కంపెనీ అభివృద్ధి చేసిన టీకా 95శాతం సమర్థత పనిచేసిందని బుధవారం వెల్లడించింది. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన ఈ టీకా తుది ప్రయోగ ఫలితాలను ఫైజర్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల వారు, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని తెలిపింది. ఫైజర్‌ టీకాను మైనస్‌ 70 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది. అందువల్ల మన దేశంలో ఈ టీకా డోసులను భారీ ఎత్తున నిల్వచేయటం అసాధ్యమని నీతీ ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అభిప్రాయపడ్డారు.