విజయసాయి రెడ్డి పై పితాని బాలకృష్ణ ఫైర్

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం: సూటు కేసుల బినామీ విజయసాయి రెడ్డి నువ్వు కుక్క కాదు ముసలి నక్క అంటూ పితాని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కలిస్తే విజయసాయిరెడ్డికి నొప్పి ఏంటి కమిషన్ ని కలిస్తే మీకు ప్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారు అంటూ పితాని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ని కలిసే హక్కు ప్రతి భారతీయుడికీ ఉంది తెలుసుకో. తెల్ల జూట్టు వేసుకున్న ముసలి నక్క జనసేన పార్టీకి బయపడి కె పవన్ కళ్యాణ్ అనే పేరుతో జాతీయ జనసేన పార్టీ పేరున రిజిస్ట్రేషన్ చేసి బకెట్ గుర్తు తీసుకుంది మీరు కదా? శివకుమార్ అనే వ్యక్తి స్థాపించిన వై యస్ ఆర్ పార్టీనీ మీరు లాక్కుని ఆధికారాన్ని అనుభవిస్తున్నది మీరు కదా? మీరా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేది, ఆయనను విమర్శ చేసే స్థాయి మీకు లేదు. రాబోయే రోజులలో మా పార్టీ అధికారంలోకి రావటం ఖాయం, మిమ్మల్ని నీ నాయకుడును తరిమె రోజులు దగ్గర పడుతున్నాయి. అంటూ ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు.