దళితుల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్: నేరేళ్ళ సురేష్

  • దళితుల గుండెల్లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక స్థానం
  • అణగారిన వర్గ ప్రజల జీవన ప్రమాణాలపై పవన్ కళ్యాణ్ కు పూర్తి అవగాహన
  • రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు జనసేన ప్రాధాన్యం
  • యస్సి, ఎస్టీ ఆత్మీయ సదస్సుకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నేరేళ్ళ సురేష్

దశాబ్దాల కాలంగా దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తూ అధికారంలోకి రాగానే దళితుల అభ్యున్నతిని అన్ని రాజకీయ పార్టీలు గాలికొదిలేసాయని ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు భవిష్యత్ ఆశాజ్యోతిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. సోమవారం 14వ డివిజన్ లోని నల్లచెరువు సుగాలి కాలనీలో జరిగిన యస్సి, ఎస్టీ ఆత్మీయ సదస్సుకి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అధ్యక్షత వహించారు. నేరేళ్ళ సురేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దళితుల్లో, నిమ్నకులాల్లో ఉన్న అమాయకత్వాన్ని, అవగాహనారాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని నాయకులు ఇంతకాలం మోసం చేసారని దుయ్యబట్టారు. దళితుల సమగ్రాభివృద్ధికి ఎన్నోఏళ్లుగా అమలవుతున్న 27 పధకాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసేసి దళితుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్మికుల సంఘం నేత సోమి శంకరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తనని తాను దళిత బిడ్డగా ప్రకటించుకున్నారో అప్పటినుంచి దళితులు తమ గుండెలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని అణగారిన వర్గ ప్రజల జీవనవిధానంపై పవన్ కళ్యాణ్ కు సమగ్ర అవగాహన ఉందన్నారు. ఎప్పుడైతే దళితులకు అందాల్సిన పథకాలు, సబ్ ప్లాన్ వంటి వాటిపై నిపుణులతో జనసేన ప్రత్యేక చర్చా కార్యక్రమం పెట్టిందో అప్పటినుంచి ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ వెంటే తామంతా నడుస్తామని పాల్గొన్న దళితులతో ప్రమాణం చేయించారు. అనంతరం 14 వ డివిజన్ అధ్యక్షుడుగా జటావత్ పవన్ నాయక్ ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రెల్లి రాష్ట్ర యువ నాయకులు సోమి ఉదయ్ కుమార్, రాములు నాయక్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దిన్, చెన్నం శ్రీకాంత్, వడ్డె సుబ్బారావు, బాలు, దాసరి రాము, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.