మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన పితాని

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ముమ్మిడివరం మండలం ఎపి మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయిమెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యాలని మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభించారు. రెండవ రోజు సమ్మెలో భాగంగా జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలియజేసారు. వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యలమీద బాలకృష్ణకి వినతిపత్రాన్ని అందజేశారు. జనసేన-తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయపరమైన కోరికలను నెరవేరుస్తామని పితాని బాలకృష్ణ హామీఇచ్చారు. తదనంతరం అంగన్వాడీ కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్యాలయం ముట్టడించడానికి వెళ్లి వస్తున్న వారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), గుద్దటి రమా కేశవ బాలకృష్ణ (జమి), గోదశి పుండరీష్, కడలి వెంకటేశ్వరరావు(కొండ), సానబోయిన వీరభద్రరావు, యలమంచిలి బాలరాజు, దూడల స్వామి, గాలిదేవర బుల్లి, పితాని రాజు, పోలిశెట్టి కుమార్, జక్కంపూడి కిరణ్, వంగా సీతారాం, బొక్క శ్రీను, చప్పిడి మహేశ్వరరావు, కొప్పిశెట్టి సురేష్, అన్నంనీడి పట్టాభి మొదలగువారు పాల్గొన్నారు.

పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, ముమ్మిడివరం మల్లాయిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి లోవరాజు పోతుకుర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు మృతిచెందగా లోవరాజుకు, అతని భార్య ప్రమాదంలో గాయపడగా వారిని అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నందు మరియు ముమ్మిడివరం కొండాలమ్మచింతకు చెందిన బొక్క సూర్య కాంతం పడిపోగా కాలుకు ఫ్రాక్ఛర్ అవడంతో కిమ్స్ హాస్పిటల్ అమలాపురం నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన వీరభద్రరావు ఉన్నారు.