మోస పూరిత విధానాలు వదిలి పాలనపై దృష్టి సారించాలి.. వైసీపీ నేతలపై పితాని ఫైర్

డా. బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ నేతలు మోస పూరితవిధానాలు వదిలివై సీపీ నేతలు పాలనపై దృష్టి సారించాలి అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి పితాని బాలకృష్ణ అన్నారు. పితాని మీడియా ముఖంగా మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యటన నిమిత్తం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్న వాహనం రంగు చూసి వైసిపి నాయకులకు రంగు పడిపోతుంది, ప్యాంట్లు తడిచిపోతున్నాయని అందుకే అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. బస్ యాత్రతో వైసిపి పునాదులు కదిలి పోతాయని అరాచక పాలన సాగిస్తున్న వైసిపి నాయకులు రాష్ట్రం వదిలి పలాయనం చిత్తగించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అధికారం చేపట్టిన తరువాత మళ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వైసిపి బి.సి.జపం చేస్తుంది. కార్పోరేషన్లు ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఒక్క లబ్ధి దారునికీ సాయం అందించకపోవడం ప్రజలు గమనించారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *