నవజాత శిశువులపై జాలి చూపండి

పార్వతీపురం, జిల్లా జాయింట్ కలెక్టర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలోని నవజాత శిశువులపై జాలి చూపించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, మహేశ్వర అజయ్ కుమార్ తదితరులు జిల్లా కెలెక్టర్ కార్యాలయంలో ని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ ను కలిసి జిల్లా ఆసుపత్రిలో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్.ఎన్.సి.యు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన నవజాత శిశువుల సంరక్షణకై జిల్లా ఆసుపత్రిలో ఎస్ఎన్.సియు ఏర్పాటు చేశారన్నారు. దీనిలో గత కొంతకాలంగా ఏసీలు పనిచేయకపోగా, ఫ్యాన్లు కూడా లేవన్నారు. దీంతో అప్పుడే పుట్టిన పిల్లలు ఓవైపు రోగంతో పోరాడుతూ మరోవైపు ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. వేసవి వేడిమి ఒకపక్క, రోగం మరో పక్క వేధిస్తుండడంతో విలవిలలాడుతున్నారన్నారు. తక్షణమే ఏసీలు మరమ్మత్తులు చేయించడం లేదా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరారు. గత కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం శోచనీయమన్నారు. తక్షణమే నవజాతి శిశువులపై జాలి చూపించి చూపించాలన్నారు. ఎస్ఎ.న్.సీ.యులో ఏసీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి పిల్లల ప్రాణాలకు హాయు కల్పించాలన్నారు. ఎస్ ఎన్ సి యు లో అధికంగా గిరిజన ప్రాంతాలకు చెందిన పిల్లలే ఎక్కువగా ఉంటున్నారన్నారు. ఎవరికి చెప్పాలో తెలియక తల్లిదండ్రులు ఆవేదం చెందుతున్నారన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.