ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోలవరం జనసేన

పోలవరం, దొరమామిడి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రంజాన్ పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ విందులో ముస్లిం పెద్దలు మాదీనా, మీరఖాన్ సైదు, రసూల్ మీరఖాన్, షేక్ బాషా, షేక్ సలీం, షేక్ సాధిక్, షేక్ బాషా మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉండాలని అన్ని మతాలు సమానం అనేది జనసేన సిద్ధాంతం అని తెలుపుతూ జనసేన నాయకులు పోలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, తొమ్మిదేళ్ల వెంకటరత్నం, సత్యనారాయణ, బుచ్చిరాజు, కొమరం మధు, దుర్గారావు జనసైనికులు, కార్యకర్తలు ముస్లిం సోదరులకు, మహిళలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చిర్రి బాలరాజు ముస్లిం పెద్దలతో మాట్లాడి రంజాన్ పండగ యొక్క గొప్పదనం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమనికి వచ్చి అందరితో కలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ విందులో కుల, మతాలు బేధాలు లేకుండా పాల్గొన్న జనసైనికులను చిర్రి బాలరాజు, కరాటం సాయి మరియు గడ్డమనుగు రవికుమార్ అభినందించారు.