పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక చెత్తవాగుడు ఎందుకు జగన్

  • ఎమ్మిగనూరు నియోజవర్గ జనసేన నాయకులు చల్లా వరుణ్

ఎమ్మిగనూరు నియోజవర్గం: వాలంటీర్ లు స్వీకరిస్తున్న సమాచారం హైదరాబాదులో ఎఫ్.ఓ.ఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక.. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తీవ్రంగా దూషించడాన్ని ఎమ్మిగనూరు నియోజవర్గం జనసేన నాయకులు చల్లా వరుణ్ తీవ్రంగా ఖండించారు.. ఈ సందర్భంగా చల్లా వరుణ్ మాట్లాడుతూ.. మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే.. నీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావ్.. బెంగళూరు ప్యాలెస్ లో ఏం జరిగింది. అక్కడ జరిగిన రాసలీలల బాగోతం బయటకు వస్తాయని.. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కీలక కాంగ్రెస్ నాయకుడికి 100 కోట్లు ఎలా పంపించారో అందరికి తెలుసు.. మీ ఇంట్లో ఉన్న అక్రమ సంబంధాలు.. నేర చరిత్ర కడప జిల్లాలో జరిగినవి అందరికీ తెలుసు.. అందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
పవన్ కళ్యాణ్ గారిని ఇంకోసారి వ్యక్తిగతంగా మాట్లాడితే నీ బాగోతంతో వెబ్ సిరీస్ లాగా బయట పెట్టాల్సి వస్తుంది ఖబర్దార్ అని హెచ్చరించారు.