పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

 సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆయనను మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం రాజమండ్రికి తీసుకెళ్లారు. పట్టాభిని బుధవారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి ఆ రాత్రి తోట్లవల్లూరు పీఎస్ లో ఉంచారు. నిన్న ఉదయం తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.