పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహం తగ్గించుకోవాలి

  • పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం: పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహం తగ్గించుకోవాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులన్న, పోలీస్ వ్యవస్థ అన అపారమైన గౌరవం ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు చేయడం తప్పడం లేదు. ప్రపంచమంతా నిద్రపోయిన మేల్కొని ఉండేది ఒకే ఒక్కడు పోలీస్. రేయనక, పగలనక, ఎండ, వాన అనే తేడా లేకుండా పండగొన్న పబ్బమున్న తన కుటుంబ సభ్యులకు దూరంగా బాధ్యతాయుతంగా తన బాధ్యతలను నిర్వహించే పోలీసు రియల్ హీరో. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. కానీ వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పోలీస్ వ్యవస్థను తన కనుసైగల్లో పెట్టుకొని తద్వారా ప్రతిపక్షాలను అణిచివేసేనందుకు ఉపయోగించటం అత్యంత దారుణం. హక్కులను కాపాడవలసిన పోలీసులే మన హక్కులను కాల రాస్తే ఎవరిని అడగాలి ఏమని అడగాలి. భారత రాజ్యాంగము ఆర్టికల్ 19 ప్రకారము వాక్ స్వాతంత్ర్యం మరియు భావవ్యక్తీకరణ హక్కు నుండి నిరసన తెలియజేయవచ్చు. నిరసన తెలిపే హక్కు, బహిరంగంగా సవాలు చేయడం మరియు ప్రతిస్పందించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయడం అనేది ప్రజల ప్రాథమిక రాజకీయ హక్కు. ఇవన్నీ పోలీసు ఉన్నతాధికారులకు తెలియనివి కావు అయినా అధికార పార్టీ ఒత్తుళ్లకు తలగ్గొటం తగ్గదు. విషయానికొస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి మరో 11 రోజులు రిమాండ్ విధించటం తెలిసింది. దాంతో తెలుగుదేశం పార్టీ సోమవారం నిరసన తెలియజేస్తుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడకక్కడే గృహనిర్బంధం చేస్తున్నారు. పోలీసులు మరో అడుగు ముందుకేసి జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను గృహనిర్బంధించడం వారి అత్యుత్సాహానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ప్రతిపక్షాలను బెదిరించడానికి, కట్టడి చేయడానికి హక్కులను కాలరాయడానికి మాత్రమే పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు పునరా ఆలోచన చేయాలి. కంచె చేను మేసిన చందాన రక్షించవలసిన పోలీసులే పౌర హక్కులను కాలరాయటం ధర్మం కాదు. జనసేన మరియు టిడిపి నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి వినాశకాలే విపరీత బుద్దులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వైసిపి చేస్తున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారు.