దుబ్బాక లో ప్రారంభమైన పోలింగ్

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దుబ్బాక లో ఎన్నికల పోలింగ్  ప్రారంభమైంది.. కాగా, కోవిండ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి సానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఓటు వేసేందుకు లోనికి అనుమతిస్తున్నారు. అలాగే మందులను కూడా అందుబాటులో ఉంచారు. ఇదిలాఉండగా, ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు దుబ్బాకలోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఇదిలాఉండగా, దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.