వాయిదా పడిన ఆన్ లైన్ తరగతులు

తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆన్ లైన్ తరగతులను రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వాయిదా వేస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తరగతుల వాయిదాకు నిర్ణయం తీసుకున్నారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ పేర్కొన్నారు. తదుపరి ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.