శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న పోతిన మహేష్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ వివిధ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా చేసుకుంటున్నారని, శ్రీకృష్ణ మహాప్రభు భగవద్గీతలో బోధించిన విధంగా మనుషులు సన్మార్గంలో ఎలా నడవాలో తెలిపారని. శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించారు.

  1. విజయవాడ కొత్తపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ వేణుగోపాల స్వామి వారి శ్రీ కృష్ణ జయంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది . కమిటీ వారు మహేష్ సాదరంగా ఆహ్వానించి దర్శనం అనంతరం కండువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
  2. శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యూత్ ప్రధాన కార్యదర్శి తుమ్మగంటి ఫణీంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది
  3. ఏకలవ్య నగర్ లో శ్రీ వేణుగోపాల సేవా సమితి వారి ఆధ్వర్యంలో 7వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో నిర్వహించారు నిర్వాహకులు ముగడ దుర్గారావు, కే కొండయ్యల ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొనడం జరిగింది
  4. ఆంధ్రప్రభ కాలనీ సెంట్రల్ నియోజకవర్గంలో త్రైత సిద్ధాంతము ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు నిర్వాహకులు తిరుపతిరావు సత్యం ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
  5. సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో శ్రీ రాధాకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి 8వ వార్షికోత్సవ వేడుకల్లో నిర్వహించారు నిర్వాహకులు ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
  6. కృష్ణలంక తూర్పు నియోజకవర్గంలో అల్లు పెద్దబ్బాయి అండ్ సన్ వార్ల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో నిర్వహించారు. నిర్వాహకులు అల్లు శశి ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదనా స్టాలిన్ శంకర్, పొట్నురి శ్రీనివాసరావు, , రెడ్డిపల్లి గంగాధర్ ,నల్లబెల్లి కనకారావు, జల్లి రమేష్, బావిశెట్టి శ్రీను, పోలిశెట్టి శివ, ఆలమూరి శ్రీదేవి , మాకిన శ్రీనివాస్, నగేష్ బంగారు నూకరాజు, సోమి మహేష్ పాల్గొన్నారు.