పొట్టి శ్రీరాములు పోరాటపటిమే జనసేనకు స్ఫూర్తి.. నేరేళ్ళ సురేష్

గుంటూరు: లక్ష్య సాధనకై తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఉద్యమించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట పటిమా స్ఫూర్తితోనే జనసేన పార్టీ ముందుకు సాగుతుందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. గురువారం పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా హిందూ కాలేజీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పొట్టిశ్రీరాములు చూపిన తెగువ మహాత్మాగాంధీని సైతం ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. పొట్టిశ్రీరాములు లాంటి వ్యక్తులు పదిమంది ఉంటే చాలు బ్రిటీష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగిస్తాను అని అన్నారు అంటే పొట్టిశ్రీరాముల శక్తిసామర్ధ్యాలు ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు అంటూ కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 59 రోజులు కఠిన ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాల్ని త్యాగం చేసిన పొట్టిశ్రీరాములు త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. పొట్టిశ్రీరాములు లాంటి మహానుభావుల త్యాగనిరతిని జనసేన పార్టీ ఎప్పటికీ భావితరాలకు అందిస్తూనే ఉందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఆ క్రమంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అమరజీవి పొట్టిశ్రీరాములు పుణ్య వేదిక పేరును పెట్టారన్నారు. తొలుత నగర పార్టీ కార్యాలయంలో పొట్టిశ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ సాగర్, రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు నగర కార్యదర్శిలు, కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.