నిస్వార్థ సేవకుడికి చేరుతున్న ప్రజాబలం

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొర్రా అప్పారావు పాల్గొనడం జరిగింది. స్థానిక గ్రామ పెద్దలతో సంభాషించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న బొర్రా. అలాగే గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పెద్దలు మాట్లాడుతూ మా సమస్యలను తెలుసుకోవడానికి మా దగ్గరకే వచ్చి మాతోటి మాట్లాడి మా సలహాలను గౌరవించి మా తోటి కలివిడిగా మాట్లాడుతున్న మొదట వ్యక్తి మీరేనని మీతో కలిసి ప్రయాణం చేయటానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని మీరు తీసుకుపోయే ఏ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, బత్తుల కేశవ, కిష్టపాటి రవి, మైదుకూరు గంగ ప్రసాద్, పాలపర్తి కోటేశ్వరరావు, కిష్టపాటి సుబ్బారెడ్డి, కిష్టపాటి బ్రహ్మారెడ్డి, పిచ్చాల పున్నారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యనమాల బాబు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు హుస్సేన్, రాజు, ఆర్ అండ్ బి రావు, నాగరాజు, సుభాని, శ్రీకాంత్ రెడ్డి, సాగర్, బాషా, వై.రవి తదితర గ్రామ పెద్దలు ఉన్నారు.