జనసేన తరుపున రోడ్ వెయ్యడానికి సన్నాహాలు

పోలవరం, మడకం వారి గూడెం గ్రామం నుంచి మెయిన్ రోడ్ కి వెళ్ళడానికి రోడ్ లేదు అని చిర్రి బాలరాజుకి విన్నవించుకోవడం జరిగింది. ఈ సమస్యని తక్షణమే పరిష్కరించేదిశగా కరాటం సాయి, గడ్డమనుగు రవి కుమార్, చిర్రి బాలరాజు స్పందించి జనసేన పార్టీ తరుపున సొంత ఖర్చుతో రోడ్ వెయ్యడానికి సన్నాహం చెయ్యడం జరిగింది. అలాగే చుట్టుపక్కల సుమారు నాలుగు గ్రామాల వారికి బస్సు షెల్టర్ కూడా కావాలని కోరగా బసషెల్టర్ ని కూడా తాత్కాలికంగా నిర్మిస్తామని ఒక వారంలోపు ఈ పనులు పూర్తి చేసి చూపిస్తామని చెప్పడమైనది. రేపటినుంచి పనులు ప్రారంభించడానికి జేసీబీ, ట్రాక్టర్లను, మెటీరియల్స్ ని సిద్ధం చెయ్యడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు, గడ్డమనుగు రవికుమార్, పసుపులేటి రాము, పూనెం కృష్ణ ఆ గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.