జనసేన తరపున పోరాటానికి సిద్ధం

కొత్తగూడెం, కెటిపిఎస్ పక్కనే ఉంచుకుని కరెంట్ లేకుండా 26 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం దంతేలబోర గ్రామపంచాయతీలోని ఎర్రబోరు ప్రాంత గిరిజన బిడ్డలు. 30 కుటుంబాలు పైగా గత కొన్ని ఏండ్లుగా చీకటిలో బతుకుతున్నారు. త్రాగడానికి మంచినీళ్లు పంపు లేదు, ఏ అధికారికి చెప్పినా పట్టించుకునే నాధుడే లేడు. తక్షణమే దీనికి బాధ్యత తీసుకుని ఎమ్మెల్యే వనమా సంబంధిత అధికారులు ఈ ప్రాంతానికి కరెంట్ పెట్టించకపోతే జనసేన పార్టీ తరుపున లీగల్ గా కూడా ఫైట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జల సంపత్, జనరల్ సెక్రటరీ దేవా గౌడ్, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రెసిడెంట్ మార్గం సందీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.