తిరుపతి పవిత్రతను కాపాడండి: జనసేన

*తిరుపతి పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించి బ్యానర్లు, హోర్డింగ్ లు పెట్టిన టీటీడీ చైర్మన్..

అధికారం మాదికనుక తిరుపతి పట్టణంలో మా పార్టీ వారి బ్యానర్లు, హోర్డింగ్ లు మాత్రమే ఉండాలి అనే ధోరణితో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఉన్న కొన్ని హోర్డింగ్ లను వెంటనే తొలగించడం జరిగింది.

అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాలలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి హోర్డింగ్ లను తొలగించి తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం విలువలను కాపాడాలని నగర కమిషనర్ కు వినతి పత్రం అందజేసి మీడియాతో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి రెడ్డి మరియు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మాట్లాడుతూ.. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలో కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వెంటనే తొలగించడం జరిగింది. మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అని వారం రోజులు గడువు లోగా ఈ ఫ్లెక్సీలను తొలగించాలి, లేనిపక్షంలో మేమే నగరంలో వెలసిన ఫ్లెక్సీలను తొలగిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.