మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కి వర్ధంతి నివాళులు

ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో విప్లవ వీరుడు, యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకొని, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మరియు జాతీయ నాయుకులు విగ్రహాలుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి నెలపూడి బేబీ రామ్ మోహనరావు, ఉపసర్పంచ్ గెద్దాడ శ్రీనివాసరావు, జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, తోట తాతాజీ, కోసూరి సూర్యనారాయణరాజు, పంపన శ్రీనివాసరావు, జనసేనపార్టీ కార్యక్రమాల కమిటీ జిల్లా సభ్యులు బండారు శేఖర్, బొక్కా జైన్, మోహన్ బాబు మొదలగువారు పాల్గొన్నారు.