కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు పవన్ కళ్యాణ్: పోతిన మహేష్

  • పవన్ కళ్యాణ్ ఒక కోహినూర్ వజ్రం.. వజ్రానికి ఎన్నటికీ విలువ, వన్నె తగ్గదు
  • ఈ రాష్ట్రానికి పట్టిన శని వైఎస్ఆర్సిపి పార్టీ
  • రాష్ట్రానికి రాహుకేతువులు సీఎం జగన్ ప్రధాన సలహాదారు సజ్జల
  • మా అంటూ అందరినీ మాయ చేశారు ప్రజలు ఆ భ్రమ నుంచి బయటపడ్డారు
  • కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపి వారి కుటుంబాల్లో పెద్ద కొడుకుగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్
  • కేసీఆర్ దత్తపుత్రుడు సీఎం జగన్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకటమహేష్ మాట్లాడుతూ కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లోని పిల్లలకు ఉన్నత విద్యను కూడా అందిస్తూ పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ అండగా నిలబడుతున్నారని, కౌలు రైతులకు ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి అన్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి సిగ్గుందా అని, ఇంకా రాష్ట్రంలో వాలంటీర్ సచివాలయ ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ఎందుకని, కౌలు రైతుల జీవితాలను గాలికి వదిలేసి అవాస్తవాలు మాట్లాడుతున్నారని, సీఎం జగన్ కూడా ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే ముఖ్యమంత్రులు అయ్యారు గానీ ప్రజల ఓట్లతో కాదని ఈ విషయాన్ని ప్రజలే ప్రతిరోజు బహిరంగంగా మాట్లాడుతున్నారని, అదేవిధంగా రాష్ట్రానికి పట్టిన శని వైఎస్ఆర్సిపి పార్టీ అని రాష్ట్రానికి రాహు కేతువుల్లా సీఎం జగన్ సజ్జల దాపురించారని, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతూ ఉంటే ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సిపి నాయకులు పవన్ కళ్యాణ్ పై అనవసరపు విమర్శలు చేస్తున్నారని, స్మగ్లర్లు గంజాయి బ్రోతల్ హౌస్ లకు వకాల్తాపుచ్చుకునే సజ్జల రామకృష్ణ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, కేఏ పాల్కు మించిన కమెడియన్ లాగా సజ్జల యాక్టింగ్ చూడలేక ప్రజలు నవ్వుకుంటున్నారని, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డ వాటి మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దానికి వైసిపి పాలనే కారణమని, పవన్ కళ్యాణ్ ఒక కోహినూర్ వజ్రం లాంటి వారిని ఆయన విలువ వన్నె ఎన్నటికీ తగ్గదని వారు నిరంతరం రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, వారిపై అనవసరపు విమర్శలు చేసిన వారు నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు అడ్డు తగిలిన ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. పథకాలు వద్దనుకుంటే తప్ప జగన్ ను సీఎంగా దించడం ఎవరివల్ల కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలే ఈ బోడి పథకాలు మాకు వద్దంటున్నారని ఈ పథకాల వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అనేక నిబంధనలు పెట్టి అర్హులందరికీ పథకాలు తొలగించడం వలన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని అందువల్ల రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడిస్తారని, మా అంటూనే అందర్నీ మాయ చేసిన విషయం వైసీపీని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కెసిఆర్ దత్తపుత్రుడు సీఎం జగన్ అని నేడు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ గురించి నాయకుల గురించి మాట్లాడుతుంటే కనీసం వైఎస్ఆర్ సీపీ నాయకులు స్పందించడం లేదని సీఎం జగన్ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి అర్హత లేదని, వెల్లంపల్లి అని గూగుల్లో కొడితే ఊసరవెల్లి అని వస్తుందని, ఎన్నికలకు ఒక పార్టీ మారే నువ్వు కూడా విలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పవన్ కళ్యాణ్ వారమంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్రజలను ఆదుకుంటున్నారని, కానీ బెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం విజయవాడ నగరంలో వసూల్ అబ్బాయి అని అందరూ అనుకుంటున్నారని ముందు దీనిపై సమాధానం చెప్పాలని చరిత్ర ఎప్పుడు ఓటమితోనే మొదలవుతుందని ఇక పవన్ కళ్యాణ్ గెలుపు చరిత్ర సునామీలో నీ ఓటమి చాలా దారుణంగా నా చేతిలో ఉంటుందని 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అనే పదేపదే ఎందుకు ప్యాంట్లు తడుపుకుంటున్నారని పవన్ కళ్యాణ్ పై అనవసరపు విమర్శలు చేస్తే తప్పక తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విజయవాడ నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ రూవుల్లా పెద్దల సభకు అనర్హుడని, వారి మునిస గౌరవాన్ని తగ్గించేలా గల్లీలో తిరిగే సిల్లీ ఫెలో లా మాట్లాడుతున్నాడని, ముస్లిం మైనార్టీ భూములను కబ్జా చేస్తూ అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, తొందర్లోనే ఎమ్మెల్సీ రోహల్లా బండారం ఆధారాలతో సహా బయట పెడతామని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా, ఎన్నమనేని కృష్ణమోహన్ సహాయ కార్యదర్శి సాబింకర్ నరేష్ పాల్గొన్నారు.