నెల్లూరు జనసేన కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం

  • జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజల బతుకు భారం పోస్టర్ ని ఆవిష్కరించిన అధ్యక్షులు పవన్ కల్యాణ్
  • పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ పాలనలోప్రజలపై పడ్డ భారాన్ని వివరించడానికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరం నుండి ప్రారంభించమనడం ఆనందంగా ఉంది త్వరలో నగరంలోని ప్రత్తి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వం చేసిన దుర్మాగాపు పాలన గురించి వివరిస్తాం, పార్టీ అధ్యక్షులు ఆదేశిస్తే నెల్లూరు నగరం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తాను, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మైకులు కనిపిస్తే ఇష్టం వచ్చినట్టు నెల్లూరు ప్రజలు అసహ్యించుకునే విధంగా మాట్లాడం అలవాటైపోయింది గడిచిన 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మూడేళ్ల కాలంలో మంత్రిగా ఉండి నెల్లూరు నగర ప్రజలకు జిల్లా ప్రజలకు ఏం అభివృద్ధి చేశారు ముందు చెప్పాలి ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చెసి మాటతప్పిన అనిల్ మాట్లాడడం హాస్యాస్పదం, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతం ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన ప్రశ్నించలేని మాజీ మంత్రి కాలం వెళ్లదీశారు, గడపగడపకి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనిల్ నీళ్లు నమ్ముతున్నారు, 9 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ నగర ప్రజలకు ఏం చేశారు చెప్పకుండా జనసేన పార్టీ వారాహి వాహనం గురించి జనసేన పార్టీ కార్యక్రమాల గురించి ప్రతి చోటా విమర్శించడం అలవాటైపోయింది, నగరంలో ఎవ్వరైనా పార్టీ కోసం పానిచేయొచ్చు, రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న ప్రజల చూపు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. జనసేన నగర పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఆంధ్ర రాష్ట్రంలో వారాహి వాహనం అడుగుపెట్టిన్న వెంటనే వైసీపీ వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది, రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వైసీపీ పాలన వైఫల్యం ప్రజల పైన భారం కార్యక్రమన్నీ నెల్లూరు నగరం నుండి ప్రారంభించమనడం, నెల్లూరు నగర అభ్యర్థిత్వన్నీ ప్రకటించడం సంతోషం, నగర ఎమ్మెల్యే అనిల్ వారాహి వాహనం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూన్నారు రాబోయే రోజుల్లో ఆ వాహనం కింద వైసీపీ ప్రభుత్వం నలిగిపోవడానికి సిద్ధంగా ఉంది, అనిల్ కేవలం డైలాగ్స్ కి మాత్రమే పరిమితం ఐయారు తప్ప నగర అభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు, త్వరలోనే 28 డివిజన్లలో ప్రత్తి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై వివరిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిది కలువాయి సుధీర్, నగర ప్రధాన కార్యదర్శి వరకుమార్, కోవూరు నాయకులూ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా, నగర నాయకులూ, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.