వైసీపీ పరిపాలనలో జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లని మడకశిర జనసేన ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

మడకశిర, స్థానిక జనసేన మండల అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీరాష్ట్ర పిఏసి సభ్యులు. ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షుడు వరుణ్ హిందూపూర్ ఇంచార్జ్ ఉమేష్ ఆదేశాల మేరకు మండలాల వారీగా గృహనిర్మాణ పథకాల పరిశీలనలో విధివిధానాలపై ప్రతి ఒక్కరు అనుసరించాలన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, జగనన్న కాలనీలలో ప్రజలకు కన్నీళ్ళే మిగిలాయాని వారు ఎద్దేవా చేశారు. జగనన్న మోసం హాష్ ట్యాగ్ తో ఈనెల 12, 13, 14 వ తేదీల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పేదలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1.80 లక్షల ఇళ్ళు కేటాయించామని ఎందుకు ప్రగల్ బాలుపలుకుతూ ప్రజలకు మోసం చేస్తున్న వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని అలాగే 1.25 సెంటులో ఇళ్ళు పేదలకు ఎలా నిర్మిస్తారో వైసీపీ నాయకులు ఆత్మ పరిశోధన చేసుకోవాలన్నారు. జనసేన పార్టీ పేదల కన్నీళ్లు తుడిచే ప్రతిష్టాత్మకమైన పార్టీ అని ప్రజలు ఎప్పుడు ఏ సమయంలో కష్టం అన్నా చేదోడు వాదోడుగా జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఐటీ విభాగం కోఆర్డినేటర్ ప్రసాద్, మండల అధ్యక్షుడు టి.ఏ శివాజీ మండల కమిటీసభ్యులు విజయ్ కుమార్, పవన్ కళ్యాణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.