నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం

సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నేడు (ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు కీలక మంత్రులు, అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు పాల్గొంటారు. పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ప్రతిపక్ష పార్టీల దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభ పక్షనేతలతో సమావేశం అవుతారు. సభ కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతారు.