కేంద్రమంత్రి రామ్ విలాస్‌ పాశ్వాన్‌ పార్ధివదేహానికి ప్రధాని మోడీ నివాళి

కేంద్ర మంత్రి రామ్ విలాస్‌ పాశ్వాన్‌ నిన్న (గురువారం) కన్నుమూశారు.  ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తండ్రి మృతి చెందినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అయితే..ఈ రోజు ఉదయం ఢిల్లీలో ప్రధాని మోడీ ఆయన మృతి పట్ల నివాళి అర్పించారు. కేంద్రమంత్రి ఇంటికి వెళ్లిన ప్రధాని…పాశ్వాన్‌ పార్దీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళుల్పరించారు. కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను ఓదార్చారు. పాశ్వాన్‌ కుటుంబసభ్యులతో మోడీ మాట్లాడారు. కాగా… ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్న పాశ్వాన్. పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేసారు.