జాతినుద్దేశించి కోవిడ్ 19 పరిస్థితులపై ప్రధాని మోదీ ప్రసంగం..

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. గత ఏడాది కాలంగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఓ తుఫానులా దూసుకొచ్చిందన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దని, దేశంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ బాగా పెరిగిందన్నారు. కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. వైద్య అవసరాల కోసం ఔషధాల ఉత్పత్తి పెంచామని, ఫార్మా పరిశ్రమలు త్వరిత గతిన మెరుగైన వ్యాక్సిన్లు అందిస్తున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించే తయారీదారు. ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు.

దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలి.  లాక్ డౌన్ అనేది రాష్ట్రాలకు చివరి ప్రత్యమ్నాయం కావాలి.  భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా 10కోట్లు, 11 కోట్లు, 12 కోట్ల టీకాలు అందించిన దేశంగా చరిత్ర సృష్టించింది అన్నారు.  మొత్తం తయారు చేసిన వ్యాక్సిన్లలో సగం రాష్ట్రాలకు వెళ్లనుంది.  తద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎటువంటి ఖర్చు లేకుండా టీకాలు పొందుతారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. నేడు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది అని ప్రధాని పేర్కొన్నారు.