29న ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన

ఈనెల 29న ఆకస్మికంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:10కి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. 29న సాయంత్రం 5:10కి తిరిగి మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ రాక ఉత్కంఠ రేపుతోంది.