గోమాతలను రక్షించండి: గుడివాడ జనసైనికులు

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం దగ్గర లేగ దూడ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తిని కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి పశువైద్యున్ని తీసుకుని వచ్చి వైద్యం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గోవుల్ని రోడ్లమీద రాకుండా గో యాజమాన్యాలు కట్టడి చేయాలని కోరారు. మున్సిపాలిటీ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు గోవుల్ని రోడ్ల మీద రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన పట్టించుకోవడం చాలా దౌర్భాగ్యం అని తెలియజేశారు. మన భారతదేశంలో గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తారని అలాంటి గోవులను గుడివాడ పట్టణంలో గో యజమానులు రోడ్ల మీద వదిలేయడం వల్ల ప్లాస్టిక్ మరియు చెత్తాచెదారం తిని తీవ్ర అస్వస్థ అవుతున్నాయని అదేవిధంగా రోడ్లమీద అడ్డంగా పడుకోవడం వల్ల వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దయచేసి ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి గో యాజమాన్యంతో చర్చించి గోవుల్ని రోడ్లమీద రాకుండా కట్టడి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నూనె అయ్యప్ప చరణ్ తేజ్ మట్ట జగదీష్ మరియు జనసేన పాల్గొన్నారు.