కాణిపాకం ఆలయ పవిత్రతను కాపాడండి: జనసేన డిమాండ్

చిత్తూరు: కాణిపాకం ఆలయ పవిత్రతను కాపాడాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ కోరారు. మంగళవారం జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేసంలో తులసి ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతుంది, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునే ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా.. ఆలయ పవిత్రతకు సంబంధించి అనేక వార్తలు రావడం చాలా బాధాకరం. పాలకమండలిలో కాంట్రాక్టర్ యొక్క లోపాలను, భక్తిశ్రద్ధలతో ప్రజలు సమర్పించిన విరాళాలలో అవకతవకులను, భక్తుల కోసం నిర్మిస్తున్నటువంటి సౌకర్యాలలో నాణ్యతలను కాపాడవలసిందిగా ఆలయ యాజమాన్యాన్ని కోరుతున్నాము. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా పాలకవర్గ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించాలని, అనేక సామాజిక మధ్యమాల ద్వారా వస్తున్నటువంటి విషయాలపై ఉన్న సందేహాలను తొలగిస్తూ స్వామి వారి ఆలయ పవిత్రతను కాపాడుతూ.. ప్రజలకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మీద అవగాహన పెంచాలని తులసి ప్రసాద్ కోరారు.