జగన్ పాలనలో మహిళలుకు రక్షణ కరువు – కోన తాతారావు

వైజాగ్: శాంతి నగరంగా పేరున్న విశాఖ నేడు వైసిపి పాలనలో ఆశాంతికి అడ్డాగా మారిపోతుందని మంగళవారం పౌర గ్రంధాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టి పీఏసీ సభ్యులు కోన తాతారావు అన్నారు. గత నెల 18తేదీన విశాఖలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ వైసిపి ప్రభుత్వం యొక్క వైపల్యమని, శాంతి భద్రతలపై సీఎం సమత్సరానికి ఒక్క సారైనా సమీక్ష చేయుకపోవటం, ప్రాధన్యత లేని అంశంగా చూడటం వలనే నగరంలో కాకుండ రాష్ట్రంలో మహిళలపై మునుపెన్నడు జరగనన్ని గ్యాంగ్ రేప్ లు, అగాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వైసిపి 4సంత్సరాల 7నెలలు పాలనలో ఒక్క విశాఖలో 42గ్యాంగ్ రేప్ లు నమోదయ్యాయని, రాష్ట్రంలో మహిళలుపై విమెన్ ట్రాఫికింగ్, గ్యాంగ్ రేప్ లు, ఇతర ఆగాయిత్యాలతో 25,503 పైగా కేసులు నమోదయ్యాయని, ఒక్క విశాఖలోనే 2023 సంత్సరంలో 1325 కేసులు నమోదవటం జగన్ రెడ్డి పాలనలో పోలీస్ వ్యవస్థ వైపల్యం కాంబడుతుందని ఏద్దేవా చేసారు. పోలస్ వ్యవస్థ ప్రజలకు కాకుండ అధికార పార్టి నేతల కనుసన్నాల్లో పనిచేయడం మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తెచ్చు కోవద్దన్నారు.నగర పోలీస్ కమీషనర్ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నా ఈ నగరంలో మరింత క్రైమ్ రేటు పెరుగుపోతుందని హెచ్చరించారు. విశాఖ నార్త్ ఇంచార్జి శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ మహిళల రక్షణకు సీఎం జగన్ రెడ్డి 4ఏళ్లుగా చెపుతున్న దిశా చట్టం అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ జె ఎస్ పి ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి, మహిళా రీజినల్ కో ఆర్డినేటర్లు లక్ష్మి చౌదరి, శారని దేవి, కిరణ్ ప్రసాద్, త్రివేణి, కళ తదితరులు పాల్గొని మాట్లాడారు.