జనసేన ప్రధాన కార్యదర్శిగా షేక్ నాగుల్ మీరా నియామకం

నరసరావుపేట ఆంధ్రసింహం ప్రతినిధి, నరసరావుపేట జనసేన పార్టీ ఇంఛార్జి సయ్యద్ జీలని ఆశీస్సులతో నరసరావుపేట జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా షైక్ నాగుల్ మీరా మరియు సెక్రెటరీలుగా షైక్ సుభాని, మచ్చు సందీప్, గుండాల ఆనంద్ పాల్, కత్తుల సంజయ్, పాలపర్తి మణికంఠ శర్మ నియమితులయ్యారు. ఈ నియమానికి సంబంధించి నియామకపత్రలని జనసేన పార్టీ నరసరావుపేట ఇంఛార్జి సయ్యద్ జిలని చేతుల మీదగా నరసరావుపేట పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్ నియామక పత్రలని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసరావుపేట జనసేన పార్టీ ఇంఛార్జి జీలని ఆశీస్సులతో మాకు ఈ యొక్క పదవులు కి నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నని అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకి కృషి చేస్తానని తెలిపారు.