సి రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రజా పోరాట యాత్ర

పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సి రాజశేఖర్ ప్రజా పోరాట యాత్ర కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రిష్ణగిరి మండల నాయకులు నాగేశ్వరరావు, చిరంజీవి, కాలువ భాస్కర్, అధ్యక్షతన పందర్లపల్లే, లక్కసాగరం, తెగ దొడ్డి, రాగులపాడు, గ్రామాలలో పర్యటించడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ నాయకుడు సి రాజశేఖర్ మాట్లాడుతూ.. పందర్లపల్లే గ్రామంలో ఇప్పటికీ ఒక సిసిరోడ్డు కూడా లేకపోవడం చాలా దుర్మార్గం, ఇప్పటివరకు కాంగ్రెస్, టిడిపి, ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఇలా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. చరిత్ర గురించి చెప్పుకునే ఈ పార్టీ నాయకులు ఎందుకు ఒక సిసిరోడ్డు వేయలేకపోయారు. డ్రైనేజీ సైడ్ కాలవలు ఎందుకు నిర్మించ లేక పోయారు, అలాగే ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేసిన తీరు చాలా బాధాకరం. ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు, కొన్ని చోట్ల కంకర తేలి రాకపోకలు చాలా ఇబ్బందికరంగా మారిన రోడ్లను ఈ రోజు చూశాం, అదేవిధంగా లక్కసాగరం గ్రామంలో కూడా కొన్ని చోట్ల డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయక పోవడం వల్ల రోడ్లపై మురికినీరు ప్రవహిస్తున్న దృశ్యాలు చూశాం, ముఖ్యంగా తెగ దొడ్డి గ్రామానికి సరైన రహదారి లేదు, ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపడతామని 2/1/2019 తేదీన ప్రారంభించారు.. కానీ నేటి వరకూ గ్రామానికి రోడ్డు వేయలేదు, ఈ గ్రామంలో మేము పర్యటిస్తున్నప్పుడు మాకు అవసరమైతే కంకర తీసేసి మట్టిరోడ్డు ఉండేవిధంగా చూడండి అని గ్రామ ప్రజల ఆవేదనను తెలియజేసినప్పుడు వెళ్ళేటప్పుడు మాకు అర్థమైంది..ఆ దారిలో వెళ్లే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అదేవిధంగా రాగుల పాడు గ్రామంలో వాటర్ సమస్య ఉందని గ్రామస్తుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ఎర్రి స్వామి, రామయ్య నాయుడు, సౌకత్ , దుర్గా నాయుడు, వెంకటేష్, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.