ప్రజా చైతన్యమే వైసీపీ పతనానికి నాంది

  • వైసీపీ అరాచకపాలనపై మండిపడుతున్న ప్రజలు
  • జగన్ కి ఒక్క చాన్స్ ఇచ్చినందుకు తమ బిడ్డలకు భవిష్యత్ లేకుండా చేశాడన్న ఆవేదనలో ప్రజానీకం
  • కులమతాలకతీతంగా పవన్ కళ్యాన్ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు
  • ప్రజలతో మా(టీ)టామంతి కార్యక్రమంలో జనసేన పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ల సురేష్

గుంటూరు అర్బన్: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ప్రజల్లో వెల్లివిరిస్తున్న చైతన్యమే వైసీపీ పతనానికి నాంది కాబోతున్నదని గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. గురువారం 22 వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావుతోటలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో జరిగిన ప్రజలతో మా(టీ)టామంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఉదయాన్నే ప్రజలు అధికసంఖ్యలో ఉండే టీ కొట్లు , కిరాణా , కూరగాయల షాపుల వద్ద జనసేన పార్టీ నేతలు నేరుగా ప్రజలను కలిసి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలపై ప్రజల అభిప్రాయాలను సావధానంగా విన్నారు. స్థానిక సమస్యలను ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ పట్ల , పవన్ కళ్యాణ్ నిబద్ధత పట్ల ప్రజల్లో ఉన్న అవగాహనకు నేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో జనసేన నేతలు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ టీ, టిఫిన్, కిరాణా షాప్ ల వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా అవినీతి, బంధుప్రీతి, కులమత, ప్రాంతీయ బేధాలతో ఒకే మూసలో సాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రజల్లో ఆలోచన మొదలవ్వటం శుభపరిణామం అన్నారు. జగన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల్లో ఉన్న డొల్లతనంపై సైతం ప్రజల్లో అవగాహన ఉందన్నారు. సంక్షేమం ముసుగులో అభివృద్ధిని అటకెక్కించారని, తమ బిడ్డలకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారంటూ ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహజ్వాలాల్లో వైసీపీ మాడిమసైపోయే రోజులు ఎంతో దూరంలో లేవని నెరేళ్ల సురేష్ అన్నారు. జనసేన కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ నా అక్కలు, నా చెల్లెల్లు, నా అవ్వలు అంటూ లేని ప్రేమలు ఒలకపోసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక సీరియల్ ప్రకారం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హత్యాచారాలను ఎందుకు అరికట్టడం లేదని విమర్శించారు. ఒక చేత్తో అమ్మఒడి ఇచ్చినట్లు ఇచ్చి మరోచేత్తో పెంచిన పన్నులతో, ఛార్జీలతో జగన్ రెడ్డి లాక్కుంటున్నారని, మరి సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్తుందని ఆమె ప్రశ్నించారు. మరోసారి జగన్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఆలోచన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు లేదని పద్మావతి అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ సామాన్యుల్లో సైతం జగన్ రెడ్డి దాష్టికాలపై ఒక ఆలోచన మొదలైందన్నారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని అందిపుచ్చుకోవటంలో పార్టీ నేతల కన్నా ప్రజలే ముందుండటం ముదావహం అన్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ రోజు జనసేనకు ప్రజల్లో వస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనమని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, కవిత, డివిజన్ అధ్యక్షుడు షర్ఫుద్దీన్, నగర నాయకులు చింతా రాజు, సూరిశెట్టి ఉదయ్, బండారు రవీంద్ర, సోమి ఉదయ్, రామిశెట్టి శ్రీను, యడ్ల నాగమల్లేశ్వరరావు, లక్ష్మిశెట్టి నాని , బుడంపాడు కోటి , నవీన్ , చెన్నా పోతురాజు, కోనేటి ప్రసాద్, బాషా, టీ కోటయ్య , ఇల్లా శేషు, కోలా అంజి, సుబ్బారావు, పురాణం కుమార్, శానం రమేష్, ఎర్రబోతు వాసు, సాయి, శెట్టి శ్రీను, హరి, కొనగళ్ల శేషు, తాడికొండ శ్రీను, చెన్నం శ్రీకాంత్, సోమి శ్రీను, యమ్మార్పీఎస్ వెంకటేశ్వర్లు, పులిగడ్డ గోపి, బోనం కోటేశ్వరరావు, పసుపులేటి నరసింహరావు, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.