పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం అవుతున్న జనసేన పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి సందర్శించి అక్కడి స్థానిక మండల నాయకులు మరియు జనసైనికులతో మీటింగ్ ఏర్పాటు చేసి జనసేన పార్టీ విధివిధానాల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి అందరికి వివరించడం జరిగింది. అదేవిధంగా త్వరలో మండల పార్టీ కార్యాలయం ప్రారంభం జిల్లా నాయకులతో ఉంటుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. అనంతర్మ్ యాడికి మండలంలోని వెంగమ నాయుడు కాలనీకి చెందిన జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కమ్మరి మధు ఆచారి సోదరుడైనటువంటి కమ్మరి రామయ్య ఆచారి మరియు రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశానికి జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు యాడికి మండల కన్వీనర్ కోడి సునీల్ కుమార్ హాజరయ్యారు. మొదట వెంగమనాయుడు కాలనీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు కదిరి శ్రీకాంత్ రెడ్డిని గౌరవప్రాయంగా డ్రమ్స్ వాయిస్తూ బాణసంచా కాల్చి ఆహ్వానం పలికారు అనంతరం కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు సునీల్ కుమార్ దంపతులు ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. జనసైనికుడి కుటుంబ సభ్యులను, కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరించారు తద్వారా పూజా కార్యక్రమంలో పాల్గొని విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ నాయకులు మరియు వెంగమనాయుడు కాలనీకి చెందిన జనసైనికులు మల్లికార్జున, నాగభూషణం, మంజునాథ, ఆచారి, అరవింద్, రాంభూపాల్, ఓబులేసు, దేవా, అబ్దుల్, జయసింహ మరియు యాడికి మండల ఉపాధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి శివ, పప్పు వెంకటేష్, పోలా రాజేష్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.