పుల్లంపేట రోడ్డు ప్రమాదం బాధాకరం: జనసేనాని

కడప నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట దగ్గర లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడటం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గాయాల పాలైన పది మందికీ మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను కోరుతున్నానని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని, తగిన ఆర్థిక సహాయం అందించాలని, సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అతి వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసిందని, పోలీసు, రవాణా శాఖల అధికారులు రహదారి భద్రత చర్యల్లో భాగంగా వేగ నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని జనసేనాని తెలిపారు.