బ‌ట‌న్ నొక్క‌డ‌మే కాని.. నిధుల మంజూరేది?: పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, సంక్షేమ పథకాలపై గొప్పగా ప్రచారం చేసుకుంటూ సీఎం జగన్‌ ఆర్భాటంగా బటన్‌ నొక్కడం తప్ప ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాలో మాత్రం డబ్బులు జ‌మ‌కావ‌డం లేదని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి విమర్శించారు. సోమ‌వారం త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ముందుగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు.

సీఎం జ‌గ‌న్ బటన్ల మీద బటన్లు నొక్కుతున్నామ‌ని, ఖాతాలో డబ్బులు వేశామంటూ ఆర్భాటాలు చేస్తున్నా ల‌బ్దిదారుల‌కు నిధులు అంద‌టం లేద‌ని ఆరోపించారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, అందుకు వడ్డీ మాఫీ వర్తింపజేస్తామని చెప్పి నిధులు విడుదల చేసి రెండు నెలలు అయినా వడ్డీ మాఫీ రుణం పడక ద్వాక్రా మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నార‌ని వివ‌రించారు. జగనన్న విద్యాదీవెన పెట్టి ఏటా తానే పీజులు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ వాస్తవంగా విద్యాదీవెన పథకం నిధులు విడుదలై నెల అయినా ఆ డబ్బులు పడక కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయ‌ని ఆరోపించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఈబీసీ నేస్తం కింద ఏడా దికి రూ.15 వేలు అందిస్తానని డప్పు కొట్టి గతనెలలో ప్రకాశం జిల్లాలో సీఎం బటన్ నొక్కారని, ఇంత వరకు మహిళల ఖాతాల్లో రూపాయి పడలేదని మండి ప‌డ్డారు. మోస‌పూరిత హామీల‌తో, క‌ట్టుక‌థ‌ల‌తో తిరిగి సీఎం కావాల‌ని జ‌గ‌న్ శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, పేద‌ల‌ను మ‌భ్య‌పెట్టి ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు.

  • రాష్ట్రంలో నిశ్శ‌బ్ద‌ విప్ల‌వం

వైసీపీ పాలనలో విద్యుత్‌ చార్జీలు, పెట్రోలు, గ్యాస్‌తో పాటు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, మద్యపాన నిషేధం హామీ అటకెక్కిందన్నారు. అయినప్పటికీ ఏదో ఒక పథకం ద్వారా తమకు కొంతమేర లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ప్రజలు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కలేదన్నారు. కాగా.. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ లోపాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారని, సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కడమే తప్ప నిధులు మంజూరు చేయడం లేదని నిల‌దీస్తున్నార‌ని, రానున్న ఎన్నికల్లో వైపీపీకి గుణపాఠం చేప్పేందుకు సిద్ధమవుతున్నా తెలిపారు. వంచ‌న‌తో, మోసంతో ఎల్ల‌కాలం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌లేర‌ని, రాష్ట్రంలో నిశ్శ‌బ్ద‌ విప్ల‌వం మొదైలందని, త‌మ బంగారు భ‌విష్య‌త్తు కోసం ఎన్నిక‌ల్లో కూట‌మికి అధికారం అప్ప‌గించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలిపారు.