తగ్గేదే లే !! డిసెంబర్ 17న పుష్ప – అఫీషియల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన్న శ్రీవల్లి గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక రెండు పార్టులుగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మొదటి పార్టు డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే మధ్యలో ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది వాయిదా పడింది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ వాటికి చెక్ పెడుతూ…. డిసెంబర్ 17న పుష్ప రిలీజ్ కాబోతుంది. తగ్గేదే లే అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసింది.