బాపూజీకి ‘శ్రమదానం’తో పవన్ నివాళి

స్వాతంత్ర్య కాంక్షను భారతీయులందరిలో రగిలించి, అహింసాయుత మార్గం ద్వారా ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సంగ్రామం నడిపించిన బాపూజీ తరతరాలకు ఆదర్శప్రాయుడు.

మహాత్ముడి సందర్భంగా ‘శ్రమదానం’తో నివాళులర్పించాలని డిసైడ్ అయ్యింది. శ్రమదానంలో ముఖ్య భూమిక పోషించాలని ఆ మహాత్ముడు పలికిన పలుకులు నిత్యం మాకు అనుసరణీయాలు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

ప్రపంచమంతా ముక్తకంఠంతో గొప్ప నాయకుడిగా కొనియాడిన మహాత్ముడి 152వ జయంతి సందర్భంగా నా పక్షానా, జనసైనికుల పక్షాన అంజలి ఘటిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతిపిత స్ఫూర్తితోనే అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా రోడ్లకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేయాలని పవన్ సంకల్పించారు. ఆ స్ఫూర్తిదాతకు ఇదే మా నివాళి అంటూ ప్రకటించారు.

ఇక అక్టోబర్ 2వ తేదీ నాడే పుట్టిన దివంగత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో విశిష్టమైన కృషి చేశారని.. ఆయన జయంతికి నివాళులర్పిస్తున్నట్టు పవన్ తెలిపారు.

1965లో మనదేశంపై దురాక్రమణ చేసిన పాకిస్తాన్ పీచమనిచి భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిన శాస్త్రీజికి పవన్ అంజలి ఘటించారు.