పూతలపట్టు నియోజకవర్గ జనసేన కార్యవర్గ సమావేశం

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గ జనసేన కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సూచనల మేరకు, పూతలపట్టు నియోజకవర్గం కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ ఆధ్వర్యంలో తవణంపల్లి మండల పార్టీ కార్యాలయంలో జరిగింది, ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. 1.మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కలిసి ప్రతి పంచాయతీలో పర్యటించి కార్యకర్తలను గుర్తించే కార్యక్రమం చేపడతారు, తదుపరి సమావేశం జూన్ 12వ తేదీ కొత్త సభ్యులతో సమావేశానికి హాజరు అయ్యేలా చూసుకోవాలి. 2. మండలంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి మీద చేయవలసిన పోరాట ప్రణాళికలను రూపొందించుకుని, పోరాట సమయంలో మిగిలిన మండలాల సహాయం తీసుకునేలాగా ప్రణాళిక రచించుకోవాలి. 3. మండలంలో జనసైనికులు యొక్క ఇబ్బందులను గుర్తించి, ఇన్సూరెన్స్ వివరాలను ట్రాక్ చేసి వారికి అండగా ఉండే విధంగా ప్రణాళికను రూపొందించారు. 4. మండలంలో కొత్తగా జెండా ఆవిష్కరణ చేయవలసిన ప్రాంతాలను గుర్తించి, రాబోవు కార్యక్రమంలో వివరాలను తెలియపరచాలి. 5. ప్రతి పంచాయతీలో పార్టీ కోసం పనిచేసే మహిళా కార్యకర్తలను గుర్తించి, వారికి అండగా నిలుస్తూ వీరమహిళా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. 6. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను తయారుచేసి ప్రజల్లోకి వెళ్లే లాగా ప్రణాళికని రచించుకోవాలి. 7. సోషల్ మీడియాను పార్టీకి ఉపయోగపడేలాగా పార్టీ కార్యక్రమాలను ప్రమోట్ చేస్తూ, ప్రింట్ మీడియా విలేకరులతో కలిసి వెళ్లే లాగా ప్రణాళికను రచించుకోవాలి. 8. పార్టీ కోసం కొత్తగా పనిచేసేవారిని కలుపుకుంటూ, పార్టీ ఏర్పాటు చేసిన కమిటీకి అనుసంధానం చేసుకోవాలి. పై అంశాల మీద తదుపరి సమావేశంలో మండల అధ్యక్షులు వివరించి, వారి యొక్క సమస్యలను నియోజకవర్గం నుండి పనిచేస్తున్న జిల్లా కమిటీ సభ్యులకు తెలియజేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, మండలాధ్యక్షులు బి రాజశేఖర్, బి కుమార్, బండారు మనోహర్ ఉపాధ్యక్షులు పూర్ణచంద్ర, శివప్రసాద్, శీను మండల ప్రధాన కార్యదర్శులు ఉదయ్, అజిత్, వెంకటేశు సీనియర్ నాయకులు చిన్న, వెంకటేశ్వర్లు, మాధవ, సెల్వరాజ్ యువ నాయకుల జగదీష్, లతీష్, లోహిత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.