జాతీయ రైతు దినోత్సవ వేడుకలలో పుట్టపర్తి జనసేన

పుట్టపర్తి: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పుట్టపర్తి నియోజకవర్గం, కోవెలగుట్టపల్లి గ్రామ పరిదిలోని పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులను సన్మానించి అనంతరం పవన్ కళ్యాణ్ గారికి రైతులు పట్ల ఉన్న బాధ్యతను వివరించి.. చనిపోయిన 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు.. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి అబ్దుల్ అబు, డాక్టర్ తిరుపతేంద్ర, బోయవంశీ, మేకల పవన్, శివ, అభి, రాము, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.