2020 నూతన విద్యాపాలసీతో నాణ్యమైన విద్య

గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ జాతీయ నూతన విద్యా పాలసీ-2020తో ప్రపంచానికి నాణ్యమైన విద్య నిందించే కేంద్రం భారత దేశం నిలుస్తుందని అన్నారు. నూతన విద్యావిధానంతో విద్యార్ధులు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారుగా కాకుండా ఉద్యోగాల్ని సృష్టించే వారుగా మారే అవకాశం ఉందని అన్నారు. నూతన విధానంతో భారత్‌ విశ్వగురుగా మారనుందన్నారు. నాణ్యమైన విద్యతో ప్రపంచ పౌరుగా మారే అవకాశం ఉందన్నారు. రప్రపంచ విజ్ఞాన ఖనిగా సూపర్‌పవర్‌గా భారత్‌ను రూపొందించేందుకు అన్నివర్గాల వారు కలిసి రావాలన్నారు. భారతీయ విద్యా సంస్థల ద్వారా ప్రపంచ స్థాయి విద్యనందించ వచ్చని చెప్పారు.

నూతన విద్యావిధానాన్ని విజ్ఞతతో అర్ధం చేసుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానాన్ని అమలు పరచడంలో విజ్ఞునులు, మేధావులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాధమిక స్ధాయిలో విద్యార్ధులు తమ మాతృభాషలో విద్యను అర్ధం చేసుకోవాలన్నారు. జపాన్‌, జర్మనీ, కొరియా వంటి దేశాలు కూడా విద్యార్ధులకు తమ మాతృభాషల్లోనే విద్యాబోదన చేసి టెక్నాలజీలో లీడర్స్‌గా ఎదిగాయని గవర్నర్‌ పేర్కొన్నారు.