ప్రచార పత్రాలకు కోట్లు – ప్రశ్నాపత్రాలకు తూట్లు

ఆమదాలవలస, పాఠశాల విద్యార్థులపై పాలకుల సవతి ప్రేమ, విద్యకు పెద్దపేట నాడు నేడు పేరిట పాఠశాలలకు మహర్దశ పేరిట పదేపదే గొప్పలు చెబుతున్న పాలకులకు చేతల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహనరావు ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన జనసేన నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగట్టారు.
ఇటీవల ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికి కరపత్రాలను పంచిందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కనీసం ప్రశ్నాపత్రాలను ముద్రించకుండా పరీక్షల వ్యవస్థని తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విద్యా వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కానీ మన రాష్ట్రంలో అధికార పార్టీ మద్యానికి ప్రాధాన్యమిచ్చి పేద కుటుంబాలను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబులు విషయంలో సైతం బైజుస్ కంపెనీకి కోట్లాది రూపాయలు సంతర్పణ చేసి తిరిగి కమిషన్ల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వాస్తవం కాదో, అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఊరి బడిని పేద విద్యార్థులకు దూరం చేశారని, వేలాది ఉపాధ్యాయుల పోస్టులు రద్దుచేసి, నిరుద్యోగ ఉపాధ్యాయులను వంచించారని పేర్కొన్నారు ఆఖరికి రాష్ట్రంలోని దేవాలయాలను ధ్వంసం చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నగదు బంగారం సైతం ప్రక్కతో పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అరాచకాలకు పేద విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.